అచ్చ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ.. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో వరుసగా చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది టాలీవుడ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సాగర తీరాన నీలి రంగు శారీలో ఫొటోలకు పోజులిస్తూ అలరించింది.
రామన్ రాఘవన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన శోభిత.. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ పలు సినిమాల ద్వారా ఆడియన్స్ను ఆకట్టుకుంది.
తెలుగులో మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించిన శోభిత.. తమిళంలో పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసింది. గతేడాది మంకీ మ్యాన్ సినిమా ద్వారా విభిన్న కంటెంట్ చిత్రాలతో మంచి ఇమేజ్ క్రియేట్ సొంతం చేసుకుంది.
గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను వివాహం చేసుకోగా.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.
ఇటీవలే సెట్లో వంటలు చేస్తున్న ఫొటోస్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా శోభిత షేర్ చేసింది. ఇక తాజాగా చీరకట్టులో సాగరతీరంలో ఆహ్లాదకరమైన ఫొటోస్ను పోస్ట్ చేసింది.
సముద్ర తీరంలో నీలిరంగు చీరకట్టులో సింపుల్గా ఉన్న శోభిత ఫొటోస్కు నెటిజన్లు లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకోగా.. ఆ తర్వాత మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది.