అటు హీరోయిన్గా, ఇటు అక్కినేని ఇంటి కోడలిగా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది శోభిత. ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలను పంచుకుంటుంది.
ఓ సారి వంట చేస్తూ, మరోసారి సాగర తీరంలో చీరకట్టులో హుందాగా కనిపించిన శోభిత.. ఈ సారి మరో ఇంట్రెస్టింగ్ ఫొటోస్ను షేర్ చేసింది.
అయితే ఇక్కడే తన గురించి ఓ క్రేజీ విషయాన్ని పంచుకుంది శోభిత. తనకు కెమెరా వైపు చూడటం ఇష్టముండదు అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
తనకి కెమెరా వైపు చూడటం కంటే స్క్రీన్‌లో తనని తాను చూసుకోవడమే ఇష్టమంది. అందుకే తన ఫొటోలు స్ట్రెయిట్‌గా ఉండవు అని చెప్పింది.
ఇండియన్ అంకుల్స్ ఇలాగే పోజులిస్తారు కదా.. నన్ను కూడా అలాగే అనుకోండి అని చమత్కరించింది శోభిత. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి తర్వాత శోభిత మొదటిసారిగా తమిళ్లో పా రంజిత్ డైరెక్షన్లో సినిమా చేస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.