Add These in Daily Breakfast: ఉదయం లేవగానే ఒక టీ, టిఫిన్ చేయడం భారతీయులకు ఆనవాయితీ. ఇడ్లీ, దోస, వడా, పూరీ ఇలాంటి టిఫిన్లను ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే, ఇలా మూస ధోరణిలో రోజూ ఒకే రకమైన అల్పాహారం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ మెనూలో కొన్ని మార్పులు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే ఆహారం మెదడు పనితీరు వేగాన్ని, ఆయుష్షును నిర్ణయిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, మెదడుకు శక్తిని ఇచ్చే సూపర్ ఫుడ్స్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.
ఉదయం మీ అల్పాహారంలో బ్లూబెర్రీలు ఉండేలా చూసుకోండి. వీటిలో యాంథోసైనిన్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు కణాలను రక్షిస్తాయి. ప్రతిరోజూ కొద్దిగా బ్లూబెర్రీస్ తీసుకుంటే.. జ్ఞాపకశక్తి మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.గుడ్లలో కోలిన్ అనే అద్భుతమైన పోషక పదార్థం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని నియంత్రించే అసిటైల్‌కోలిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ప్రాసెస్డ్ ఆహారాలకు బదులుగా గుడ్లు తినడం వల్ల మెదడుకు చురుగ్గా పనిచేస్తుంది. ప్రతిరోజూ కోలిన్ తీసుకున్న పెద్దల్లో 12 వారాల్లోనే జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు ఓ అధ్యయనంలో తేలింది.గ్రీన్ టీలో కెఫీన్‌తో పాటు L-థియానైన్ అనే అరుదైన పోషక పదార్థం ఉంటుంది. కెఫెన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. మధ్యాహ్న భోజనానికి ముందు కొద్దిగా గ్రీన్ టీ తాగడం వలన రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.వాల్‌నట్స్, సాల్మన్‌లో లభించే ఒమేగా-3 కొవ్వులు మెదడు కణాల వృద్దికి చాలా అవసరం. వీటిలోని డీహెచ్‌ఏ అనే కొవ్వు మెదడు కణాల వృద్దికి బాగా ఉపయోగపడుతుంది. ఉదయం కొన్ని వాల్‌నట్స్ లేదా కొద్దిగా సాల్మన్‌ను ఆహారంలో చేర్చుకుంటే మానసిక స్థితి మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ఓట్స్ ఫైబర్ శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అయ్యి, శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఈ ఆహారాలు జీవక్రియను మెరుగుపరిచి, మెదడును సురక్షితం చేస్తాయి. మీ ఆయుష్షును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.