RS Brothers Vanasthalipuram: ఆర్ఎస్ బ్రదర్స్ తన అతిపెద్ద 15వ షోరూమ్‌ను వనస్థలిపురంలో సెప్టెంబర్ 26న ప్రారంభించింది. పనామా గోడౌన్స్ సమీపంలోని బొమ్మిడి ఎలైట్ టవర్స్‌లో నూతన షోరూం ప్రారంభోత్సవంలో.. అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు పాల్గొని సందడి చేశారు.
- Advertisement -
వస్త్ర రంగంలో రిటైల్ షాపింగ్ పరంగా తనదైన ముద్ర వేసుకున్న ఆర్‌ఎస్ బ్రదర్స్.. క్రమక్రమంగా హైదరాబాదులో తన షోరూం లను విస్తరిస్తోంది.హైదరాబాద్ నగర వాసులకు మరింత దగ్గర అయ్యేందుకు ఆర్‌ఎస్ బ్రదర్స్ తన అతిపెద్ద 15వ షోరూమ్‌ను అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతుల చేత వనస్థలిపురంలో ప్రారంభించారు.వనస్థలిపురంలో ఆర్‌ఎస్ బ్రదర్స్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన నాగచైతన్య సంప్రదాయం, విశ్వసనీయత, సరికొత్త ఫ్యాషన్లకు కేరాఫ్ ఆర్‌ఎస్ బ్రదర్స్ అని నాగచైతన్య అన్నారు.పండుగలు మొదలుకొని వివాహాది శుభకార్యాలకు కుటుంబసమేతంగా కలిసి వచ్చి షాపింగ్ చేసేలా అన్ని రకాల కలెక్షన్స్, వైవిధ్యభరితమైన మోడల్స్.. ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో అలరిస్తాయని శోభిత పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాగచైతన్య, శోభితను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.