నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా అలయ్ బలయ్ నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులతో కలిసి దత్తాత్రేయ, వీహెచ్ డప్పు వాయించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే అజాత శత్రువనీ బండారు దత్తాత్రేయను ప్రముఖులు కొనియాడారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ సీ.జె జస్టిస్ ఎన్వీ రమణ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పాల్గొన్నారు.
సినీనటులు అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పలువురు ప్రముఖులు వేడుకలో భాగమయ్యారు.
ఈ ఏడాది ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో వివిధ కళారూపాల సందడితో ఘనంగా అలయ్ బలయ్ నిర్వహించారు.