మన ఇంట్లో ఉండే కూరగాయలలో వంకాయ ఒకటి. దీన్ని అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. దీని గుత్తి వంకాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది. వంకాయ కేవలం రుచిగా ఉండడం మాత్రమే కాకుండా శరీరానికి మేలు చేసే శక్తివంతమైన కూరగాయ కూడా. ఈ క్రమంలో వంకాయ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్: వంకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది గుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.
అధిక రక్తపోటు: రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి వంకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే న్యూట్రియెంట్లు ముఖ్యంగా పొటాషియం, రక్తనాళాలును విస్తరించి, అత్త పుట్టిన సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయి. దీని కారణంగా హై బీపీ సమస్యలు తగ్గుతాయి.
విటమిన్ b6: వంకాయలలో ఏంటి యాక్సిడెంట్లు, విటమిన్ b6 పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని న్యూరో ట్రాన్స్ మీటర్స్ సరైన మోతాదులో చేస్తాయి. దీని కారణంగానే మూడు మెరుగుపడి, డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
డయాబెటిస్: షుగర్ ఉన్న వారికి వంకాయ మంచి ఆహారం. ఇందులో ఉండే రోబ్ ఫైబర్, ఫ్లావనాయిడ్స్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు, వంకాయను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి.