ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ పేగుల్లోని మలినాలు బయటకు సులభంగా పంపిస్తాయి.
మనకు అందుబాటులో ఉండే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో చిలగడదుంపలు ఒకటి. ఇవి మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కుపెడితే అక్కడ దర్శనమిస్తాయి. చిలగడదుంపలు స్వీట్ గా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ A, C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ పేగుల్లోని మలినాలు బయటకు సులభంగా పంపిస్తాయి.
చిలగడదుంపలో ఉండే పొటాషియం, మాగ్నీషియం రక్తపోటను నియంత్రణలో ఉంచుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగి గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
వీటిలో ఉన్న సహజ చక్కెర నెమ్మదిగా శరీరంలో కలుస్తుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా చిలగడదుంపలు పరిమితంగా తినవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు చిలగడదుంపలు తినవచ్చు. వీటిలో ఉండే అధిక ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
చిలగడదుంపలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే, విటమిన్ C చర్మాని మెరిసేలా చేస్తుంది.