వంటింట్లో ఉండే అనేక ఆహార పదార్థాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధం కూడా! వీటిలో ఉండే మెగ్నీషియం, రాగి, ఐరన్, కాల్షియం, పాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు, A, K, E, B గ్రూప్ విటమిన్లు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతిరోజూ కేవలం 2 నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం.
వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పైపెరిన్ రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
నల్ల మిరియాలు దగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే కఫాన్ని మృదువుగా చేసి శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ఇవి గొంతులో దురద, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.
బరువు తగ్గడానికి నల్ల మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పైపెరిన్ అనే పదార్థం శరీర కొవ్వును కరిగించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది.
నల్ల మిరియాలలో ఉండే సహజ పదార్థాలు చర్మంలోని అదనపు బ్యాక్టీరియాను, మెలనిన్ను నియంత్రిస్తుంది. దీంతో సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
నల్ల మిరియాలు పేగులను శుభ్రపరిచి, శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. వీటిని దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, మలబద్ధకం, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.