నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, రోజులో ఎంత బిజీ గా ఉన్న ఉదయం లేదా సాయంత్రం కేవలం 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే, దాదాపు 200–300 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
రోజూ స్కిప్పింగ్ చేస్తే మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంటే వ్యాయామం పూర్తయినా కూడా బాడీ కేలరీలను బర్న్ చేస్తూనే ఉంటుంది.
స్కిప్పింగ్ ఒకేసారి కాళ్లు, చేతులు, భుజాలు, పొట్ట, వెన్ను కండరాలను పని చేయిస్తుంది. అందుకే కండరాలు బలంగా మారి స్టామినా పెరుగుతుంది.
దీని వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. స్కిప్పింగ్ వల్ల గుండె వేగం పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. దీని కారణంగా గుండె కండరాలు బలంగా మారతాయి.
స్కిప్పింగ్ చేస్తే ఎముకలపై కొంచెం ఒత్తిడి ఏర్పడి వాటి బలం పెరుగుతుంది.
స్కిప్పింగ్ చేస్తే మెంటల్ హెల్త్ బాగుంటుంది. స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్స్ స్ట్రెస్, ఆందోళనలను తగ్గిస్తాయి. దాంతో మనసు ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది.