పాలు ఆరోగ్యానికి అవసరమైన మంచి పౌష్టికాహారం. సంపూర్ణ ఆరోగ్యానికి పాలు తప్పనిసరని పోషకాహార నిపుణులు చెబుతున్నారు!ఇందులో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ డి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా, ఎదిగే పిల్లలు పాలు తాగితే, ఎముకలు బలంగా ఉంటాయి. అయితే, పాలను వేడిగా లేదా చల్లగా తాగడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి చల్లని పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లని పాలు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనిలోని కాల్షియం జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఒక గ్లాసు చల్లని పాలు తాగడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
చల్లని పాలలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మానికి కూడా దోహదం చేస్తుంది.
ఎముకలు బలహీనంగా ఉన్నవారు చల్లని పాలు తాగవచ్చు. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ D, ప్రోటీన్.. ఎముకలు, కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమయంలో చల్లని పాలు తాగడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. పాలలోని కాల్షియం ఆమ్లాలను తగ్గించి, ఉపశమనాన్ని ఇస్తాయి.