రోజూ పాలు తాగడమే కాదు, పెరుగును తినడం కూడా ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ప్రోబయోటిక్స్, విటమిన్ బి12, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో రోజూ ఒక కప్పు పెరుగు తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అజీర్థి, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఉంటే పెరుగు తినడం మంచిది.
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు కడుపు ఎక్కువ సేపు నిండుగా భావన కలిగిస్తాయి.
పెరుగు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే, శరీరంలో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
పెరుగులో ఉండే ఖనిజాలు, ప్రోబయోటిక్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇందులో ఉండే కాల్షియం, భాస్వరంలు దంతాల్ని, ఎముకల్ని బలంగా ఉంచుతాయి. రోజూ కప్పు పెరుగును తింటే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.