పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పండు ప్రత్యేకత దానిదే! ఇక బ్లూబెర్రీస్ విషయానికి వస్తే, ఇవి చిన్నగా గుండ్రని నీలం రంగులో ఉన్నప్పటికీ అనేక పోషకాలు ఉంటాయి. వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. బ్లూబెర్రీస్ తరచుగా తింటే అనేక వ్యాధుల నుండి రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. బ్లూబెర్రీస్ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, ఆంథోసైనిన్లు, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. బ్లూబెర్రీస్ రక్తపోటు, కొలెస్ట్రాల్ అనేక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బ్లూబెర్రీస్ బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతి కలుగుతుంది.
బ్లూబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, అనేక ఇతర అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.