మన వంటింట్లో ఉండే ఆహార పదార్థాలలో అల్లం ఒకటి. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ క్రమంలో రోజు చిటికెడు అల్లం ముక్క తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అల్లం జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు గొంతు నొప్పి ని తగ్గిస్తాయి.
ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణాన్ని నివారిస్తుంది.
క్రమం తప్పకుండా దీని ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అల్లం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే అంశాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చలికాలంలో సంభవించే వైరల్ సమస్యలను నివారిస్తుంది.