నానబెట్టిన పచ్చి శనగలను పోషకాహార పవర్హౌస్. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పచ్చి శనగల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు నానబెట్టిన పచ్చి శనగలు తినడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
నానబెట్టిన శనగలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఫైటోన్యూట్రియెంట్లు రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేస్తాయి. గుండె పరితీరును మెరుగుపరుస్తాయి.
నానబెట్టిన నల్ల శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని పలు అధ్యయానాలు సూచిస్తున్నాయి. వీటిలో ఉండే మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
చర్మం, జుట్టు:ఇందులో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి చర్మానికి ఎంతో మంచిది. ఇవి చర్మాని తేమగా ఉంచి ముడతలు రాకుండా చేస్తాయి. పుచ్చకాయ గింజలలో ఉండే ప్రోటీన్లు జుట్టు పెరుగుదలకు, జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి సహాయపడుతాయి.