బొప్పాయి గింజలు ఆరోగ్యకరమైన జీవనశైలికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటు ను నియంత్రణలో ఉంచుతాయి. ఈ గింజలలో ఉండే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా దీని తినేటప్పుడు వీటి గింజలు చెత్త అని భావించి పడేస్తుంటాం. వాస్తవానికి ఇందులో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు.
బొప్పాయి గింజలు ఆరోగ్యకరమైన జీవనశైలికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటు ను నియంత్రణలో ఉంచుతాయి. ఈ గింజలలో ఉండే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి, బొప్పాయి గింజలు ఒక గొప్ప. ఈ విత్తనాలలో జీవక్రియను పెంచే, కొవ్వును కాల్చడానికి సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
ఈ గింజలలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉండవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో ఉండే ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
బొప్పాయి గింజలు నిర్విషీకరణను ప్రోత్సహించడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మూత్రపిండాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.అయితే, ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.