Anupama Parameswaran Interview: తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ తాజాగా కిష్కింధపురితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జతకట్టిన అనపమ తన నటనతో క్రేజీ హీరోయిగా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
బెల్లకొండ సాయిశ్రీనివాస్‌తో కలిసి నటించిన ‘కిష్కిందపురి’ సెప్టెంబరు 12న విడుదలై హిట్‌టాక్ సొంతం చేసుకుంది.అనుపమ కొన్నిసార్లు చటుక్కున కోపం వచ్చేస్తుందని, ఉన్నట్టుండి మూడీగా మారిపోతుంటానని చెప్పింది.ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతానని, తోటపని, ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, కూరగాయలు తరగడం వంటివన్నీ చేస్తానంటోంది.మంచి రోజులు, చెడు రోజులు అంటూ లెక్కపెట్టుకోనని, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తానని, అదేపనిగా ఏడుస్తూ కూర్చోనంటోంది ఈ అమ్మడు.మన మనసును మించిన ఫ్రెండ్ మరొకరు ఉండరంటోంది ఈ ముద్ధుగుమ్మ. అందుకే అద్దంముందు నిల్చుని తనతో తానే మాట్లాడుతుందట.సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం బైసన్, లాక్‌డౌన్, పెట్ డిటెక్టివ్ అనే మూడు చిత్రాలున్నాయి.