
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోమవారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించుకున్నారు, దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేదాశీర్వచనం పొందారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆలయం ముందు ఉన్న అఖిలాండ వద్ద కర్పూరం వెలిగించి, కొబ్బరి కాయ కొట్టి స్వామి వారికి సమర్పించారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు.

శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా గాయత్రి సదనంలో బస చేశారు.

హిందూ మత సంప్రదాయాలను గౌరవిస్తూ, టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రంపై సంతకం చేశారు.

ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ, ముందుగా మాడ వీధుల్లోకి వెళ్లారు. మొదటగా శ్రీ భూ వరాహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత కల్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించారు.