Apple iPhone 17 Features: టెక్ దిగ్గజం ఆపిల్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17ను ఈనెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. లాంచింగ్ కు ముందే, ఈ ఫోన్ కు సంబంధించిన అనేక ఫీచర్లు లీకయ్యాయి. అవేంటో చూద్దాం.
ఆపిల్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17ను ఆవిష్కరించింది. ఈనెల 19 నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ఎయిర్ విడుదల కానున్నాయి.అత్యంత పలుచగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్లు.. గత ఐఫోన్‌లతో పోలిస్తే పూర్తి భిన్నమైన రూపాన్ని, డిజైన్‌ను కలిగి ఉంటాయి.6.6 అంగుళాల OLED డిస్‌ప్లే, 48 ఎంపీ బ్యాక్ కెమెరా, 24 ఎంపీ ఫ్రెంట్ కెమెరా, 2800mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో రానుంది.ఐఫోన్ 17 ఎయిర్ ప్రారంభ ధర సుమారు $899 (భారత కరెన్సీలో రూ. 75,000 వరకు) ఉండొచ్చని అంచనా.ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆపిల్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.