Saturday, November 15, 2025
Homeగ్యాలరీArattai App: వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తోన్న అరట్టై.. కోటి డౌన్‌లోడ్స్‌తో అదరగొడుతోన్న భారతీయ యాప్‌

Arattai App: వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తోన్న అరట్టై.. కోటి డౌన్‌లోడ్స్‌తో అదరగొడుతోన్న భారతీయ యాప్‌

Arattai App Huge Responce: ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాప్‌ దాదాపు అందరి ఫోన్లలోనూ ఉంటుంది. అటువంటి పాపులర్‌ వాట్సాప్‌కు పోటీగా ఓ భారతీయ యాప్‌ రిలీజైంది. అరట్టై పేరుతో దీన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.

- Advertisement -
వాట్సాప్‌కు పోటీగా భారత్‌కు చెందిన జోహో సంస్థ అరట్టై అనే స్వదేశీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొంది. ప్రస్తుతం దీనికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత శుక్రవారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ డౌన్‌లోడ్లు 75 లక్షలు ఉండేది. ఇప్పుడు ఏకంగా కోటి దాటింది.
ప్రస్తుతం ప్లేస్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్స్‌ లిస్ట్‌లో అరట్టై 4.8 శాతం రేటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు, యాపిల్ స్టోర్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ దాంట్లో ఇది నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.
తమిళంలో అరట్టై అంటే అర్థం పిచ్చాపాటీ సంభాషణ. ఈ యాప్‌ ద్వారా మెసేజ్‌లు చేసుకోవచ్చు. అలాగే వీడియో కాల్స్‌, వాయిస్ సదుపాయం ఉంది. మీటింగ్స్‌లో పాల్గొనడం, స్టోరీస్, ఫొటోలు, డాక్యుమెంట్స్ కూడా షేర్ చేసుకోవచ్చు.
క్లీన్ ఇంటర్ఫేస్‌, గోప్యత వంటి వాటిపై ఫోకస్‌ పెట్టడంతో మంచి యాప్‌గా దీనికి గుర్తింపు వస్తోంది. అంతేకాదు పాకెట్స్ అనేది ఈ యాప్‌లో ప్రత్యేకత. మనకు కావాల్సిన సమాచారాన్ని ఇందులో స్టోర్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా ఉన్నా కూడా ఈ యాప్‌ పనిచేస్తుంది. కానీ ఎండ్‌టు ఎండ్‌ ఎన్‌క్రిష్షన్ మాత్రం లేదు. ఈ ఫీచర్‌ను చాట్స్‌లో త్వరలోనే తీసుకొస్తామని జోహో ఫౌండర్‌ శ్రీధర్ వెంబు తెలిపారు.
వాట్సాప్‌కు ధీటుగా దీనిలో అన్ని ఫీచర్లను అందించారు. దీంతో, ఇప్పుడు ఈ స్వదేశీ యాప్‌కు అమాంతం డిమాండ్‌ పెరుగుతోంది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రమోట్‌ చేస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad