పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పండు ప్రత్యేకత దానిదే. దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఏ పండు అయినా మితంగా తీసుకుంటేనే మంచిది. అలాగే ఈ పండు కూడా అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఆరోజాన్ని పనులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పండుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
జీర్ణ సమస్యలు: మీ పండు ఆరోగ్యానికి మంచిదే అయినా, అధికంగా తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ జన సమస్యలు తలెత్తవచ్చు. ఎక్కువగా తింటే గ్యాస్, ఉబ్బరం వేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది.
గుండె ఆరోగ్యం: కివిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కావున ఇప్పటికే గుండె సమస్యలు లేదా అధిక రక్తపోటు కోసం మందులు వాడుతుంటే దీనినే తినడం మానుకోవాలి.
చర్మ సమస్యలు: కివి తొక్కలపై ఉండే సన్నని వెంట్రుకలు వంటి ఫైబర్స్ చర్మానికి తగిలిన లేదా ఇప్పటికే అలెర్జీ సమస్య ఉన్న కివి తింటే దురద లేదా ఎరుపు దుద్దుర్లు తలెత్తవచ్చు.
నోటిలో మంట: ఎక్కువ పండని కివిలో ఎంజైమ్ కారణంగా కొంతమందికి నోరు, పెదవులు లేదా గొంతులో జరదింపు లేదా మంట వచ్చే అవకాశం ఉంటుంది. కావున పండిన కివి తింటే మంచిది.