కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పు, అన్నం కలిపి కాంబినేషన్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. కందిపప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. కావున, వీటిని క్రమంగా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా రక్తపోటు నియంత్రిణలో ఉంటుంది. అయితే, ఈ రుచికరమైన పప్పు కొందరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటె కందిపప్పును తినడం మానుకోవాలి. దీనిలో ఉండే ప్యూరిన్లు వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి, కీళ్ల నొప్పులు, వాపు సమస్యకు దారితీస్తాయి. అయితే, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కందిపప్పుకు బదులుగా పెసర పప్పు లేదా మసూర్ పప్పును తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
కొంతమందికి పప్పు ధాన్యాల్లో ఉండే ప్రోటీన్ వల్ల అలెర్జీ కలగవచ్చు. ఇది ఒక రకమైన ఆహార అలెర్జీ. శరీరం ఈ ప్రోటీన్‌ను హానికరంగా భావించి, హిస్టామిన్ వంటి రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది చర్మపు దద్దుర్లు, దురద లేదా ఇతర అలెర్జీ లక్షణాలకు కారణమవుతుంది.
మూత్రపిండాల రోగులకు కందిపప్పు హానికరం. ఎందుకంటే దీనిలో అధిక పొటాషియం ఉంటుంది. ఇది ఇప్పటికే కిడ్నీ సరిగా పనిచేయనివారిలో అధిక పొటాషియం స్థాయిలు రక్తంలో పేరుకుపోయి, సమస్యలను మరింత పెంచుతాయి. దీని వలన మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇతర సమస్యలు తలెత్తవచ్చు.
ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉంటె కందిపప్పు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణవ్యవస్థ జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా దీని తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. కడుపు సమస్యలు ఉన్నవారు కందిపప్పు బదులు, సులభంగా జీర్ణమయ్యే పెసరపప్పును తినవచ్చు.