Baba Vanga Prediction: జులై 5వ తేదీ వస్తుందంటనే జపాన్ దేశస్థులు గజగజ వణికిపోతున్నారు. మరోవైపు ప్రపంచ మొత్తం కూడా ఏం జరగనుందోననే ఉత్కంఠతో ఉన్నారు. ఎందుకుంటే దీనికి కారణం కాలజ్ఞాని బాబా వంగా జ్యోతిష్యం.
జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. 2011లో భారీ భూకంపం, సునామీని కూడా ఆమె ముందుగానే ఊహించి హెచ్చరించారు.
బాబా వంగా రచించిన ‘ది ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకం ఇప్పుడు జపనీయులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆ పుసక్తంలో 2025, జులై 5వ తేదీన జపాన్‌లో భారీ సునామీ వస్తుందని తెలిపారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రపు నీటి అడుగున సంభవించే పేలుడు ఇందుకు కారణంగా ఊహించారు.
దీంతో జులై 5న ఏం జరగనుందో అంటూ జపనీయులతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ వార్తతో జపాన్ పర్యాటక రంగం కుదేలైంది. హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోయాయి.
ఈ నేపథ్యంలో బాబా వంగా ఊహించినది నిజం కాదని.. ఆమె చెప్పినట్లు ఏం జరగదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ప్రజలు మాత్రం ఆమె మాటలనే నమ్ముతున్నారు. గతంలో ప్రిన్స్ డయానా మృతి, సునామీ వంటివి ఆమె ఊహించినట్లే జరిగాయి. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.
Disclaimer: మరి ఇది నిజమవుతుందా..? కేవలం మూఢ నమ్మకంగా మిలుగుతుందా..? రేపటితో తేలిపోనుంది.