అరటిపండ్లు శక్తి, జీర్ణక్రియ, బరువు నిర్వహణకు మేలు. వ్యాయామం ముందు, తర్వాత, అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో తినడం ఉత్తమం. కానీ, వాటిని ఎప్పుడు, ఎలా తినాలో వాటి వివరాలు తెలుసుకుందాం.
బనానాలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, శక్తి, జీర్ణక్రియ, బరువు నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సరైన సమయంలో అరటిపండు తినడం ద్వారా శరీరానికి గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లలో అధికంగా ఉంటాయి, కాబట్టి శక్తి అవసరమయ్యే సమయంలో, వ్యాయామానికి ముందు లేదా అల్పాహారం సమయంలో తినడం అత్యంత లాభకరంగా ఉంటుంది.
వీటిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్‌గా పనిచేస్తూ గట్ బాక్టీరియాను పెంపొందిస్తుంది.
వ్యాయామానికి ముందు, బ్రేక్ ఫాస్ట్ సమయంలో, మధ్యాహ్నం భోజనం తర్వాత, వ్యాయామం తర్వాత బనానా తినడం ఉత్తమం. వ్యాయామానికి 15 30 నిమిషాల ముందే అరటిపండు తినడం కండరాలకు తక్షణ శక్తిని అందిస్తుంది.
అల్పాహార సమయంలో అరటిపండు, ఓట్ మీల్ లేదా పెరుగు వంటి ఆహారాలతో కలిపి తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండటానికి, ఉదయం అలసటను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం తినడం ద్వారా భోజనాల మధ్య అనుభవించే అలసట తగ్గుతుంది.
వ్యాయామం తర్వాత అరటిపండు తినడం శరీరంలోని ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో, పొటాషియం స్థాయిలను నిలిపి ఉంచడంలో, కండరాలను రికవరీ చేయడంలో సహాయపడుతుంది. బరువు నిర్వహణ కోసం, అరటిపండు తినడం మంచి ఆహార ఎంపిక. ఇవి తక్కువ కేలరీలతో, అధిక ఫైబర్‌తో ఉండటం వల్ల, ఆకలిని తగ్గించి, ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది.
అదేవిధంగా, తియ్యటి అరటిపండ్లు శరీరానికి శక్తిని, ఫైబర్ సమతుల్యాన్ని అందిస్తాయి. అయితే, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, అరటిపండు అలెర్జీ లేదా మైగ్రేన్ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి.
మితంగా తినడం, సరైన సమయంలో తీసుకోవడం ద్వారా అరటిపండ్లు శక్తినిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ, బరువు నియంత్రణలో గరిష్ట లాభాలు అందిస్తాయి. ప్రతి రోజూ సమయానికి, నిర్ధిష్ట పరిమాణంలో అరటిపండ్లను తినడం ద్వారా శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది.