ప్రముఖ నిర్మాత ‘బండ్ల గణేష్’ నివాసంలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘బండ్ల దివాళీ 2025’ పేరుతో తన ఇంట దీపావళి పార్టీ ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు పలువురు సినీ తారలు, ప్రముఖులు హాజరై సందడిగా గడిపారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రాక దివాళీ పార్టీలో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.
కుర్ర హీరోలు తేజ సజ్జ, బెల్లంకొండ శ్రీనివాస్, సిద్దు జొన్నలగడ్డ, లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి తనూజ్, సీనియర్ హీరో తరుణ్ వేడుకల్లో పాల్గొన్నారు.