Friday, December 12, 2025
Homeగ్యాలరీBenefits of Dates: టీ, కాఫీ బదులు ఉదయాన్నే ఖర్జూరాలు తినండి.. మైండ్ బ్లోయింగ్‌ రిజల్ట్‌..!

Benefits of Dates: టీ, కాఫీ బదులు ఉదయాన్నే ఖర్జూరాలు తినండి.. మైండ్ బ్లోయింగ్‌ రిజల్ట్‌..!

Benefits of Dates When eat in The Morning Time: చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ లేదా కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. దీంతో, ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామని భావిస్తుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ అలవాటు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే, ఉదయం లేవగానే ఖర్జూరాలు తినాలని సలహా ఇస్తున్నారు.

ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే బదులు, ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్‌కు ముందే ఖర్జూరాలు తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ సహజంగా పెరుగుతాయి.
అయితే, మనం ఉదయాన్నే తీసుకునే కాఫీ లేదా టీ ఇచ్చే శక్తి తాత్కాలికమేనని, ఖర్జూరాలు ఇచ్చే శక్తి మాత్రం మెల్లగా, దీర్ఘకాలం పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి మూడు రకాల సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో తక్షణ శక్తిని అందిస్తాయి.
మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకుంటే, తరచూ తీపి తినాలనిపించే కోరిక కూడా తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అదే విధంగా, ఖర్జూరాలలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. భోజనం తర్వాత వచ్చే అసౌకర్యాలు తగ్గడంతో పాటు, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News