పీనట్ బటర్ అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఆకృతి క్రీమీగా ఉంటుంది. పీనట్ బటర్ బ్రెడ్, చపాతీ లేదా ఓట్స్‌తో తినవచ్చు. బరువు తగ్గాలన్న, కండరాలను పెంచుకోవాలన్న పీనట్ బటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
పీనట్ బటర్ లో తక్షణ శక్తిని అందించే ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీన్ని తినడం వల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.
ఇది గుండెకు ఎంతో మంచిది. పీనట్ బటర్ లో లభించే అసంతృప్త కొవ్వులు శరీరంలో LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
పీనట్ బటర్ లో ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. ఇవి జిమ్ చేసేవారికి మంచి ఆహారం. ఇందులో విటమిన్ E, విటమిన్ B6, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.
ప్రతిరోజూ పీనట్ బటర్ తినడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగించబడతాయి. దీంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది.
పీనట్ బటర్ ఉండే అంశాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది.