Saturday, November 15, 2025
Homeగ్యాలరీSandalwood: గంధంతో తళతళ మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా చేస్తే మీ చర్మ...

Sandalwood: గంధంతో తళతళ మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా చేస్తే మీ చర్మ సమస్యలు మాయం..!

Benefits of Sandalwood Face Pack: మన సాంప్రదాయంలో గంధానికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిసిందే. ఆయుర్వేద మూలికల్లోనూ గంధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు, గంధంతో అందాన్ని సైతం పెంచుకోవచ్చు. ముఖంపై మొటిమలను నివారించడానికి, తళతళ మెరిసేందుకు గంధాన్ని ఉపయోగించవచ్చు. ఇలా గంధంతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

గంధం చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని అలర్జీల నుంచి రక్షించి మొటిమలను దూరం చేస్తుంది. ఒక టీస్పూన్ గంధం పొడి, చిటికెడు పసుపు, కర్పూరం కలిపి ముఖానికి ప్యాక్ చేసుకొని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, నల్లమచ్చలు పోతాయి.
జిడ్డు బాగా ఉండే చర్మంపై తరచుగా ధుమ్మ, ధూళి పేరుకుపోతుంది. అలాంటివారికి చందనం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర టీస్పూన్ గంధం పొడి, కొంచెం టమోటా రసం, అర టీస్పూన్ ముల్తానీ మట్టి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖంపై పూసుకొని.. 15 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.
గంధంలోని తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాల వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు, మీ చర్మంపై నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. చర్మంపై జిడ్డును తొలగించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
మెరిసే చర్మం కోసం ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం పొడి, కొబ్బరి నూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. డార్క్ స్పాట్స్ వదిలించుకోవడానికి, రెగ్యులర్ టాన్ పొందడానికి దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మచ్చలు పోయి.. ముఖం తళతళ మెరుస్తుంది.
గంధం వృద్ధాప్యానికి చెక్‌ పెడుతుంది. గంధపు చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇది చర్మ ముడుతలను నివారించి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. దీంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad