రాత్రిపూట మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వు, తక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
రాత్రి సమయంలో సలాడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కీరదోస, టమాటా, క్యారెట్, బ్రోకలీ వంటి కూరగాయలతో సలాడ్ తయారు చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్, నిమ్మరసం ఉపయోగించవచ్చు.
వెజిటబుల్ సూప్స్ రాత్రి భోజనానికి అద్భుతమైన ఎంపిక. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉండి, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
అరటిపండు, బొప్పాయి, ఆపిల్ వంటి పండ్లు తినడం మంచిది. ఈ పండ్లలో ఉండే విటమిన్స్, మినరల్స్ త్వరగా జీర్ణమవుతాయి. నిద్ర కూడా హాయిగా పడుతుంది.
రాగి, జొన్న వంటి చిరు ధాన్యాలతో చేసిన రొట్టెలు, ఊతప్పాలు తీసుకోవచ్చు.
రాత్రిపూట పచ్చి కూరగాయలు, తక్కువ నూనెతో వండిన కూరలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.