వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. శరీరంలో మెటబాలిజం తగ్గుతుంది. శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేదు. దీంతో బరువు పెరుగుతుంది. అలాగే ఈ వయసులో హైబీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటే ఈ వ్యాధులను నివారించవచ్చు.
స్ట్రాబెర్రీ ఫైబర్ & యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇవి బరువు నియంత్రణలో ఉంచుతాయి. అలాగే, క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి.
బీట్రూట్లో పోటాషియం, పోషకాల సమృద్ధి ఉంటుంది. ఇది బీపీ నియంత్రిస్తుంది. రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, బీపీ తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఈ వయసులో కోడిగుడ్లు తప్పకుండ తీసుకోవాలి. ఇందులో ఉండే క్యాల్షియం, ప్రోటీన్ ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.