మన ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యాంగా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అయితే, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లేదా ఆమ్లత్వం వంటి సమస్యలు తరచుగా కొనసాగితే జీర్ణవ్యవస్థ బలహీనపడిందని అర్థం. కావున కొన్ని సహజ ఆహారాలు డైట్లో చేర్చుకుంటే ఈ కడుపు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఎపిగ్యాలోకాటెచిన్ గ్యాలేట్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కడుపులోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండ దీని తాగితే మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తుంది.
ఓట్స్: ఓట్స్ ఫైబర్, ప్రోటీన్ తో కూడిన పోషకమైన ధాన్యం. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అవి భాస్వరం, విటమిన్ E, జింక్ గొప్ప మూలం. ఓట్స్ సరైన జీర్ణ పనితీరును నిర్వహిస్తుంది. శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగిస్తుంది.

పెరుగు: కడుపు నొప్పికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో పెరుగన్నం ఒకటి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు, పెరుగు తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.