నీటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మానేశారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఇందులో గుండె సంబంధిత సమస్యలు కూడా ఒకటి. ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ఈ సమస్యల నుంచి కాపాడుతాయి.
ఈ లిస్టులో చియా గింజలు ముందుంటాయి. ఇందులో ఉండే సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
సోయాబీన్స్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అంతేకాదు ఇందులో ఒమేగా 3, విటమిన్ కే, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
వాల్ నట్స్: వాల్ నాట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, విటమిన్ B6, పోలీస్ ఆమ్లం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కావున ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. వాల్ నట్స్ జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
అవిస గింజలలో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
కాఫీ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన రోజు ఒక కప్పు కాఫీ తాగితే గుండెకి ఎంతో మేలు.