హలీమ్ సీడ్స్‌ని గార్డెన్ క్రెస్ అంటారు. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. దీని వల్ల అనీమియా సమస్య తగ్గుతుంది. జుట్టు బలంగా మారడమే కాకుండా చర్మం కూడా హెల్దీగా మారుతుంది.
మస్క్ మెలన్ గింజల్ని తీసుకుంటే ప్రోటీన్ అంది కడుపు నిండుగా ఉంటుంది. స్కిన్ కూడా హైడ్రేట్ అయి ఫ్రెష్‌గా మారుతుంది. దీంతో జీర్ణ శక్తి కూడా మెరుగ్గా మారుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
పుచ్చగింజలు ఇవి ప్రోటీన్‌కి చాలా మంచిది. ఇందులోని ప్రోటీన్ మజిల్స్‌కి మేలు చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, స్కిన్‌ని హెల్దీగా చేస్తుందని, మెటబాలిజాన్ని పెంచి జీర్ణమయ్యేలా చేస్తుందని సూచిస్తున్నారు.
గుమ్మడి గింజలు మంచి నిద్ర మీ సొంతమవుతుంది. ఎముకలు బలంగా మారి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గోళ్ళు, జుట్టు బలంగా పెరుగుతుంది.
చియా సీడ్స్ బరువు తగ్గడానికే కాదు, అందం పెరగడానికి కూడా ఈ గింజల్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
సబ్జానే బేసిల్ సీడ్స్ అంటారు. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవాలి.వీటిని తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అసిడిటీ, బ్లోటింగ్ వంటివి తగ్గుతాయి. స్కిన్ లోపలి నుంచి అందంగా మారుతుంది.
అవిసెల్ని పెరుగులో కలిపి ఉదయాన్నే తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ మెరుగ్గా మారుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.
పొద్దుతిరుగుడు గింజలు కూడా మంచి స్నాక్ ఐటెమ్. ఈ గింజల్ని మనం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా మధ్యాహ్నం స్నాక్‌లో అయినా తీసుకోవచ్చు. ఈ గింజల్లోని పోషకాలు జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.