రోజుకు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతుంటారు. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన విటమిన్లు A, D, B12, ఇనుము వంటి కీలక పోషకాలతో నిండి ఉంటుంది.
మెదడు చురుకుగా పనిచేస్తుంది, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుడ్లను కొందరు ఆమ్లెట్ రూపంలో మరికొందరు ఉడికించి తీసుకుంటారు.
నూనెలో వేయించడం వల్ల గుడ్డుకు ఒక ప్రత్యేకమైన రుచి, ఆకృతి వస్తుంది. అయితే నూనె అనగానే చాలామంది భయపడతారు. కానీ అన్ని నూనెలు చెడ్డవి కావు.
ఉడికించిన గుడ్డు జీర్ణం కావడం చాలా సులభం. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా దీనిని సౌకర్యవంతంగా తినవచ్చు. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు ఉడికించిన గుడ్డు ఫర్ఫెక్ట్.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అయితే ఉడికించిన గుడ్లు మీకు కరెక్ట్.