BHEL Recruitment 2025: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. కేవలం 10వ తరగతి అర్హతతో మంచి ఉద్యోగం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 500కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంపెనీకి చెందిన వివిధ యూనిట్లలో ఆర్టిసన్ గ్రేడ్ -IV పోస్టుల భర్తీ చేపట్టనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమన్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1072, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.472 చెల్లించాలి. ఆసక్తి గల వారు ఆగస్టు 12 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55శాతం మార్కులతో ఉత్తీర్ణణ సాధించాలి. అలాగే ఐటీఐ/ఎన్టీసీ + ఎన్ఏసీ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.29,500 -రూ.65,000 జీతం అందుతుంది.