హైదరాబాద్ నుంచి దాదాపుగా 110 కి.మీ. దూరంలో ఉన్న భూకైలాస్ దేవాలయం.. శివునికి అంకితం చేయబడిన గుడి. నగరవాసులు కేవలం ఒక్క రోజులో వెళ్లి రావచ్చు. కార్తిక మాసం సందర్భంగా ఈ ఆలయ విశిష్టతలేంటో తెలుసుకుందాం.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి సమీపంలోని భూకైలాశ్ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ప్రత్యేకమైన జలాల మధ్య ఉండటంతో.. భక్తులు నీటిలోకి దిగి దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
వాసునాయక్ అనే వ్యక్తి తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు రావడంతో తన అన్నయ్య శంకర్ రెడ్డితో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు.
తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఆలయంపై భాగంలో 65 అడుగుల ఎత్తైన ఒక భారీ శివుని విగ్రహం ఉంది. ఇంకా వీరభద్రుడు, ఆంజనేయస్వామి, కాళభైరవుడిని దర్శించుకోవచ్చు.
తాండూర్ నుంచి 4 కి. మీ దూరంలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా తాండూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. సొంత కారు ఉంటే హైదరాబాద్ నుంచి నేరుగా ఆలయానికి వెళ్లొచ్చు.
భూకైలాస్ ఆలయంలో శివయ్య దర్శం కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఒక్కరికి రూ. 100 గా ఉంది. కార్తిక మాసం సందర్భంగా ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.