Dammu Sreeja to enter Bigg Boss house: సెప్టెంబరు 7న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. మెుత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో సామాన్యుల కేటగిరీ నుంచి ఎంపికైన దమ్ము శ్రీజ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహారించనున్నారు.ఈసారి బిగ్ బాస్ లోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు.సెలిబ్రిటీల కేటగిరిలో రాము రాథోడ్, సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి శంకర్, శ్రష్ఠి వర్మ, తనూజ, ఆశా సైనీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.ఇక సామాన్యుల కేటగిరీలో దమ్ము శ్రీజ, పవన్ కల్యాణ్ పడాల, హరీశ్, డీమాన్ పవన్, మర్యాద మనీష్, ప్రియ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇందులో దమ్ము శ్రీజ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఏకంగా లక్ష రూపాయల జీతాన్ని వదిలేసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ ముద్దుగుమ్మ ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ నెలకు లక్షరూపాయలు సంపాదిస్తుందట. అయితే బిగ్ బాస్ పై ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేసిందట.