ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పర్యటించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో బిల్‌గేట్స్ చర్చించారు.
అనంతరం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. పాలనలో టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం ఎలా వినియోగిస్తుందో పరిశీలించారు.
ఉండవల్లి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. అక్కడ మహిళా రైతులు ఆయనకు భారతీయ సంప్రదాయంలో స్వాగతం పలికారు.
తెలుగు వంటకాలను రుచి చూశారు.
సాగులో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని స్వయంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.