Saturday, November 15, 2025
Homeగ్యాలరీBSNL: ప్రైవేటు టెలికాం సంస్థకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ధరలోనే ఎక్కువ వ్యాలిడిటీ!

BSNL: ప్రైవేటు టెలికాం సంస్థకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ధరలోనే ఎక్కువ వ్యాలిడిటీ!

BSNL Reacharge Plans: ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం అనేక అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంటే తక్కువ ధరలోనే ఎక్కవ వ్యాలిడిటీ గల ప్లాన్‌లను అందిస్తోంది. నెల రోజుల పాటు చెల్లుబాటయ్యే ప్లాన్లను చౌక ధరల్లో తీసుకువస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఈ ప్లాన్లలో ఎన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

BSNL PV-229 ప్లాన్‌ బీఎస్‌ఎన్‌లో అత్యంత పాపులర్‌ ప్లాన్‌. ఈ ప్లాన్‌ కింద అత్యంత చౌక ధరలోనే యూజర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ (ఏ నెట్‌వర్క్‌లోనైనా స్థానిక/ఎస్‌టీడీ), రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను నెల రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో కూడా చెల్లుతుంది.
BSNL STV-225 ప్లాన్ కింద రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్‌ ప్లాన్‌ ఇది. డేటా లిమిట్‌ పూర్తయిన తర్వాత వేగం 40 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ చాలా డేటాను విరివిగా ఉపయోగించే యూజర్లకు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.
BSNL PV-199 ప్లాన్ విషయానికి వస్తే.. రూ.200 లోపు మంచి డేటా, కాలింగ్ ప్యాక్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది మంచి ఎంపిక. ఈ ప్లాన్‌ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 2GB డేటా (తర్వాత 40 Kbps వేగం), అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఇది బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్‌.
BSNL STV-198 ప్లాన్ విషయానికి వస్తే.. వాయిస్ కాలింగ్ తక్కువగా, డేటా ఎక్కువగా ఉపయోగించే వారికి బెస్ట్‌ ఆప్షన్‌. ఇది 30 రోజుల పాటు 40 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వేగం 40 Kbpsకి పడిపోతుంది. ఓటీటీ, వీడియో లేదా బ్రౌజింగ్‌పై దృష్టి సారించే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
BSNL PV-107 ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో‌ అత్యంత సరసమైన ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రారంభంలో 3 జీబీ హై-స్పీడ్ డేటా, ఆ తర్వాత 40 Kbps అపరిమిత వేగాన్ని అందిస్తుంది. ఇది స్థానిక/ఎస్‌టీడీ, రోమింగ్‌పై వర్తించే 200 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad