Budget SmartPhones Releases in November to the Indian Market: భారత మార్కెట్‌లోకి ప్రతి నెలా కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజవుతున్నాయి. అప్‌డేటెడ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే ఇవి మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇప్పటికే భారత మార్కెట్‌లోకి అనేక స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అవ్వగా .. నవంబర్ నెలలో మరో ఐదు కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

వివో ఎక్స్ 300 ప్రో నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల డిస్ ప్లే గల ఈ మొబైల్ ఫోన్‌లో 50 మెగా ఫిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనిలో 6510 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.






