Tuesday, April 1, 2025
Homeగ్యాలరీచిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మెగా 157..!

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మెగా 157..!

చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి పనిచేస్తున్న మెగా157 చిత్రం ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.

- Advertisement -

వెంకటేశ్, అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు స్క్రిప్ట్ అందించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు “శంకర్ వరప్రసాద్” అనే పాత్రలో కనిపించనున్నారు. ఓ ముఖ్యమైన పాత్ర కోసం చిత్రబృందం అదితి రావు హైదరిని సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News