ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దివాళీ వేడుకల్లో పాల్గొన్నారు.
అంతకు ముందుగా బీసెంట్ రోడ్డులో చంద్రబాబు పర్యటించారు. ప్రజలకు అభివాదం చేశారు.
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
దివాళీ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిన్నారులతో కలిసి ఫైర్ క్రాకర్స్ వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు.
పున్నమి ఘాట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అబ్బురపరిచాయి.