వెలిగొండ ప్రాంత రైతు, మహిళలతోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తే బటన్ నొక్కించి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
బటన్ నొక్కడంతో తెరుచుకున్న గేట్లు…నల్లమల సాగర్ వైపు పారిన కృష్ణ జలాలు.
కృష్ణ జలాలకు లంబాడీ నృత్యంతో స్వాగతం పలికిన గిరిజన మహిళలు.
అదే సమయంలో సభా ప్రాంగణంలోనూ దద్దరిల్లే స్టెప్పులతో ఆనందాన్ని వ్యక్తం చేసిన మహిళలు, రైతులు.
వెలిగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన వెలిగొండ ప్రాజెక్టు మీనియేచర్ను వీక్షించిన సీఎం చంద్రబాబు.
ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చిన అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, అధికారులపై స్వయంగా చల్లిన సీఎం చంద్రబాబు
రైతులు, మహిళలతో ముఖ్యమంత్రి
సాంప్రదాయ వస్త్రధారణలో ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు పూజలు
అనంతరం వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి సూచికగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కాలువలకు చేరుకున్న కృష్ణా జలాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసిన ముఖ్యమంత్రి
జలహారతి అనంతరం సీఎంకు ముఖ్యమంత్రికి శ్రీశైలం మల్లిఖార్జునస్వామి చిత్రపటాన్ని అందించిన పండితులు