CM Chandrababu first Car: మన సొంత కష్టార్జితంతో మొదట కొనుగోలు చేసిన వస్తువు ఎవరికైనా ప్రత్యేకమే కదా. ముఖ్యంగా వాహనాలు, డ్రెస్సులు, ఫోన్ల వంటివాటిని మరింత అపురూపంగా దాచుకుంటారు. అచ్చం ఇలాగే ఏపీ సీఎం చంద్రబాబు దాచుకున్న ఓ అపురూప జ్ఞాపకం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది.
- Advertisement -
మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పాత ‘393’ అంబాసిడర్ కారు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.పార్టీ కార్యాలయంలో ఈ కారును పరిశీలించిన సీఎం చంద్రబాబు, దానితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా విస్తృతంగా పర్యటించినప్పుడు ఈ 393 నెంబర్ అంబాసిడర్ కారు చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని అన్నారు.ఇకపై ఈ అంబాసిడర్ కారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అపురూపంగా ఉంచనున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత వాహనమైన పాత అంబాసిడర్‌ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.