CMDussehra Celebrations in Kondareddypalli :దసరావేడుకల్లోతెలంగాణసీఎంరేవంత్ రెడ్డిపాల్గొన్నారు. తనస్వగ్రామం కొండారెడ్డిపల్లిలోకుటుంబసభ్యులతోకలిసికుటుంబసభ్యులు, గ్రామస్థులతోకలిసిదసరావేడుకలునిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు కొండారెడ్డి పల్లి గ్రామస్థులు పూల జల్లు కురిపిస్తూ, గజమాలలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన గ్రామస్థులతో కలిసి వెళ్లి జమ్మిచెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం కొండారెడ్డిపల్లి నుంచి రోడ్డుమార్గాన కొడంగల్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకున్నారు.రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా జరుపుకుంటామని తెలిపారు.తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు దసరా పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. అప్రతిహత విజయాలతో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని దుర్మమ్మను ప్రార్థిస్తున్నానని అన్నారు.