జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.
నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.
గతంలో చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా… పార్కు నిర్మాణం చేయాలని కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న తీరును నేడు ఆయన పరిశీలించారు.
పార్కులో పనిచేస్తున్న కార్మికులతో కొద్ది సేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆయనతో పాటు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్కొన్నారు.