Control Foot Cracks Tips in Winter Season: శీతాకాలం వచ్చేసింది. పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో, ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ శీతాకాలంలో మన చర్మంతో పాటు ముఖ్యంగా మన పాదాలు చర్మానికి ఎక్కువగా ఇబ్బంది పెడుతాయి. శీతాకాలంలో తేమ లేకపోవడం, చల్లని గాలులు మన పాదాల చర్మం పొడిగా, పగుళ్లు, నిర్జీవంగా మారడానికి కారణమవుతాయి.
మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య శీతాకాలంలో పాదాలకు పగుళ్లు ఏర్పడటం. దీని నుంచి ఉపశమనం పొందేందుకు అనేక రకాల క్రీములు, లోషన్లు ప్రయత్నిస్తాం. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అందువల్ల చలి కాలంలో పాదాలు పగుళ్లు కనిపించకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
మీ పాదాలను అందంగా, మృదువుగా చేసుకోవడానికి శీతాకాలంలో ఒక మాస్క్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మాస్క్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండి, నిమ్మరసం, బాడీ వాష్, కొబ్బరి నూనెతో ఈ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా బియ్యం పిండి పోయండి. సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా బాడీ వాష్, రెండు చెంచాల కొబ్బరి నూనె అందులో వేయాలి. ఈ పదార్థాలను బాగా కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ సులభమైన పద్ధతి ద్వారా మీ పేస్ట్‌ను సిద్ధం చేసుకోండి.అనంతరం మీ పాదాలకు మాస్క్ వేసుకోవడానికి.. ముందుగా మీ పాదాలను బాగా శుభ్రం చేసుకోండి. తరువాత మాస్క్ ను మీ పాదాలకు అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. మాస్క్ ఆరిన తర్వాత మీ పాదాలను కడగండి. చివరగా ఏదైనా మాయిశ్చరైజర్ రాయండి.మీరు ఈ నివారణను అవలంబిస్తే మీ పాదాలను అందంగా, మృదువుగా మార్చుకోవచ్చు. ఎటువంటి మందులు, లోషన్లు వాడకుండా సులభంగానే ఈ సింపుల్ చిట్కాల ద్వారా మీ పాదాల పగుళ్లకు చెక్ పెట్టవచ్చు.