వేసవి కాలంలో బాడీ డీ హైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండేందుకు అందరూ కీర దోస తీసుకుంటుంటారు. అయితే కీరదోసను కేవలం వేసవి కాలంలో మాత్రమే తీసుకోవాలి అనుకుంటే పొరపాటే. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ రోగ నివారిణి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ కారణంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కీరదోస జ్యూస్‌ను తీసుకోవాలి. ఇందులో 95 శాతం మేర నీరు ఉంటుంది. ఇది మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా కాపాడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
ఇక వర్షాకాలంలో చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో కీరదోసను తిన్నా లేదా జ్యూస్ చేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్.. మలబద్దకం రాకుండా కాపాడుతుంది.
వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ లేదా ఇతర కారణాల వల్ల కలిగే విరేచనాలను సైతం కీరదోస తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పలురకాల బి విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి.
కీరదోసను తరచూ తీసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనాలు కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తాజా కీరదోసతో జ్యూస్ చేసుకుని ఇందులో కాస్త అల్లం రసం, పుదీనా, నల్ల ఉప్పు, నిమ్మరసం, తేనె వంటివి కలిపి తాగితే మీ శరీరానికి మరిన్ని లాభాలు అందుతాయి.