జీవితంలో విజయం సాధించాలని అనుకునేవాళ్లు.. మీ సాయంత్రం దినచర్యలో కొన్ని అలవాట్లను చేర్చుకుని చూడండి. కొంతకాలానికి తేడా మీరే చూస్తారు. ప్రపంచంలోని విజేతలంతా దాదాపు ఇవే అలవాట్లను ఫాలో అవుతారట. అవేంటో చూద్దామా..
సాయంత్రం వర్క్ అయిపోయిన తర్వాత రేపటి కోసం ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. మరుసటి రోజు ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే ఈ రోజు ఎలా సాగిందో సాయంత్రం రివ్యూ చేసి మిస్టేక్స్ తెలుసుకోవాలి. విజయానికి ఇదే తొలిమెట్టు.
వర్క్ అయిపోయిన తర్వాత పని గురించి మర్చిపోయి పర్సనల్ లైఫ్‌లోకి వచ్చేసి.. మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జీవితంలో ఎదగడానికి చాలా ముఖ్యం.
సాయంత్రాలు కాస్త టైం దొరగ్గానే ఫోన్లో మునిగిపోకుండా.. ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి. ఉదాహరణకు ఏదైనా పుస్తకం చదవడమో.. లేదా ఆన్లైన్లో ఏదైనా నేర్చుకోవడం లాంటివి చేయండి. ఈ అలవాటు మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
ఇకపోతే ప్రతిరోజూ సాయత్రం ప్రశాంతంగా కూర్చుని మీకు నచ్చని విషయాలు, కోపం తెప్పించే విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి, వాటిని భరిస్తున్నట్టు, క్షమిస్తున్నట్టు ఫీల్ అయి.. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇలా చేస్తే మీ మనసు తేలిక అయి మీ గోల్‌పై ఫోకస్ పెరుగుతుంది.
ప్రతి రోజూ సాయంత్రం లేదా పడుకునే ముందు ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఎక్సర్సైజ్ కూడా మీ డైలీ రొటీన్లో భాగం చేసుకోండి. దీంతో మానసిక ప్రశాంతత కలగడంతో పాటు ఒత్తిడి, డిప్రెషన్ పూర్తిగా తగ్గుతాయి.
ఇక మనిషి జీవితంలో ముఖ్యమైనది నిద్ర. రోజూ త్వరగా పడుకుని త్వరగా లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం 6 నుంచి 7 గంటల సుఖ నిద్ర ఉండేలా చూసుకుంటే.. మీరు విజయ సోపానాలు సులభంగా ఎక్కుతారు.