
పుష్ప-2 సినిమా భారీ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ పుష్ప-2 భారీ వసూళ్లు సాధించింది.

ప్రేమ కథలను ఎంతో చక్కగా తెరపై ప్రదర్శించే సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఆయన సినిమాలకు, రైటింగ్ స్టైల్ కు కోట్లాది నుంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే.

హీరోలను కొత్త స్టైల్ ను ఇస్తూనే.. బలమైన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ఆర్య, జగడం, 100% లవ్, 1నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలతో ఎంతటి మేజిక్ చేశారో తెలిసిందే.

ఇక పుష్ప-2 భారీ విజయం తర్వాత సుకుమార్, అతని భార్య తబిత కలిసి ఇంట్లో వ్రతం నిర్వహించారు.

సాంప్రదాయంగా రెడీ అయి దిగిన ఫోటోలను తబిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సుకుమార్ పంచెకట్టుకోగా, తబిత పట్టుచీరలో నగలతో అందంగా రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.