గుమ్మడి గింజలు చిన్నగా ఉన్న అందులో పోషకాలు అనేకం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని రోజూ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇవి కడుపునొప్పి, విరోచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి.
ఈ గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఇప్పటికే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు వీటిని తక్కువగా తీసుకోవాలి.
గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే అలెర్జీలను కలిగిస్తాయి. దీనివల్ల గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి.
లో బీపీ ఉన్నవారు కూడా గుమ్మడి గింజలు తినకూడదు. ఎందుకంటే వీటిలోని ఉండే కొన్ని అంశాలు బీపీ తగ్గడానికి కారణంఅవుతాయి.